telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముసలోడి ప్రేమ నాకు నచ్చలేదు… గాలి తీసిన గర్ల్ ఫ్రెండ్

alpechino

హాలీవుడ్ దిగ్గజం అల్ పాచినోకు ఇజ్రాయెల్‌కి చెందిన మీటల్ డోహాన్ అనే 40 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ ఉంది. వీరిద్దరూ రెండేళ్ల పాటు డేటింగ్ చేసారు. ఏ అవార్డ్ ఫంక్షన్‌కి వెళ్లినా కలిసే వెళ్లేవారు. మొన్న జరిగిన ఆస్కార్స్ వేడుకలో పాచినో ఒంటరిగా రావడంతో ఇద్దరూ విడిపోయి ఉంటారని అప్పుడే టాక్ వచ్చింది. ఇప్పుడు మీటల్ మీడియా ముందుకు వచ్చి తామిద్దరం విడిపోయిన మాట నిజమేనని చెప్పింది.‘‘నాకు పాచినోకు మధ్య 39 ఏళ్ల గ్యాప్ ఉంది. అంతటి ముసలోడితో ప్రేమలో ఉండటం సాధ్యం కాని పని. వయసు గురించి నేను పెద్ద పట్టించుకోలేదు కానీ ఆయన ముసలోడు అనేది మాత్రం నిజమే. అందుకే నేను అంతగా ప్రేమించినా కూడా వర్కవుట్ అవ్వలేదు. మేమిద్దరం రెండేళ్ల పాటు డేటింగ్‌ చేసాం. ఈ రెండేళ్లలో నాకు కేవలం పువ్వులు మాత్రమే కొనిచ్చాడు. అతను నాకోసం ఏమీ ఖర్చు చేయలేదు. ఇటీవల నాకు పాచినోకు మధ్య గొడవ జరిగింది. అందుకే వదిలేసాను. మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు కానీ స్నేహం మాత్రం అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అతనికి ఏ అవసరం వచ్చినా నేను సాయం చేస్తాను. ఆయనతో నేను ప్రేమలో ఉండటం గౌరవంగా భావిస్తాను. కానీ మేమిద్దరం ఇకపై మంచి స్నేహితుల్లాగే ఉండాలని అనుకుంటున్నాం’ అన్నారు. అతను కోరినంత డబ్బు ఇవ్వడంలేదని వదిలేసిందని, బయటికి మాత్రం ముసలోడు కాబట్టి వదిలేసానని చెబుతోందని పాచినో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Related posts