telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ప్రభుత్వంను హెచ్చరించిన జూనియర్‌ డాక్టర్లు…

doctor medical

తెలంగాణ ప్రభుత్వంను హెచ్చరించారు జూనియర్‌ డాక్టర్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విధుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జూడాలు, రెసిడెంట్ వైద్యులు రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా, విధులను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. పెంచిన స్టైపండ్‌, ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మా సమ్మెపై స్పందించకుంటే 27 నుంచి అన్ని విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కొవిడ్​తో మృతిచెందిన వైద్యులకు రూ.50 లక్షలు, ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని సమ్మె నోటీస్​లో పేర్కొన్నారు. ఈ నెల 10న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts