telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి ఫైర్

Erraballi assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసరా పింఛన్లపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమాధానమిచ్చారు. రాష్ట్రప్రభుత్వం గతేడాది రూ. 11,725 కోట్లను పింఛన్ల కోసం కేటాయించిందన్నారు.

కేంద్రం మాత్రం రూ. 210 కోట్లు అంటే 1.8 శాతం మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయం తెలియకుండా ఆసరా పింఛన్ల విషయంలో బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తే ఉప సర్పంచుల చెక్‌పవర్‌ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.41 కోట్ల ఎకరాల్లో పంటలను సాగుచేసినట్టు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో మరో లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. 25 జిల్లాల్లోని 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

Related posts