telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ అభిమానులకు సర్ప్రైజ్… ‘గుండు’ లుక్ లో చిరు…!

Chiru

ఇటీవలే ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న (గురువారం) గుండుతో దర్శనమిచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెగాస్టార్ గుండు సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఆయన తన తదుపరి మూవీ టెస్ట్ లుక్ కోసం ఇలా రెడీ అయ్యారని తెలుస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ రాబోతుందని టాక్. ‘వేదాళం’ సినిమాలో హీరో అజిత్ గుండుతోనే కనిపిస్తాడు. కొద్దిపాటి వెంట్రుకలతో డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టేస్తాడు. ఇప్పుడు ఈ రోల్ టెస్ట్ లుక్ కోసమే చిరు ఇలా గుండుతో కనిపించారని ఫిలిం నగర్ టాక్. కాగా రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి మరింత ఫామ్‌లో కనిపిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ మరింత డిఫరెంట్‌గా స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న చిరంజీవి… కరోనా కారణంగా వచ్చిన ఈ గ్యాప్‌లో ఈ టెస్ట్ లుక్ ప్రయత్నం చేద్దామని గుండు కొట్టించినట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతేమో గానీ మెగాస్టార్ అభిమానులకు మాత్రం ఈ గుండు లుక్ సర్ప్రైజ్ అనే చెప్పాలి.

Related posts