telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాన్ ఇండియా మూవీగా “జెంటిల్ మెన్-2”

Gentlemen

1993లో శంకర్‌ని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం “జెంటిల్ మెన్”. సంగీత ద‌ర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వర‌ప‌రిచిన ఈ మూవీలోని అన్ని పాట‌లు హిట్‌గా నిలిచి దేశ న‌లుమూల‌ల‌కి వినిపించాయి. ప్రముఖ నిర్మాత కె.టి. కుంజుమోన్ తన నిర్మాణంలో అపూర్వ విజ‌యాన్ని సాధించిన ‘జెంటిల్‌మేన్’కు పార్ట్ 2గా “జెంటిల్ మెన్-2” చిత్రాన్ని ప్రకటించారు. మొదటి భాగానికి రెండింతలు ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా “జెంటిల్ మెన్-2” చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు నిర్మాత కె.టి.కుంజుమోన్. ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాష‌ల‌లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జెంటిల్‌మేన్ ఫిలిం ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పనిచేయనున్న న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వర‌లోనే ప్రకటించనున్నారు.
సినిమాను ప్రకటించిన సంద‌ర్భంగా కుంజుమోన్ మాట్లాడుతూ.. “జెంటిల్ మెన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువాదమై అన్ని దేశాల ప్రేక్షకుల‌ నుండి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. అయితే, మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా రెండింత‌లు గొప్పద‌నంతో ‘జెంటిల్‌మేన్ 2’ తెర‌కెక్కిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అని అన్నారు.

Related posts