telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ తో శ్రద్ధా కపూర్ ఐటం సాంగు…!

Shraddha-Kapoor

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోందట. శేషాచలం అడవుల నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక తన ప్రతి చిత్రంలోనూ ఓ ఐటం సాంగును పెట్టే దర్శకుడు సుకుమార్ ఇందులో కూడా మంచి జోష్ తో కూడిన ఐటం పాటను ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో నటించడానికి పలువురు కథానాయికలను పరిశీలించిన మీదట శ్రద్ధా కపూర్ ను సంప్రదించినట్టు, ఇది చేయడానికి ఆమె అంగీకరించినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు గాను ఆమెకు భారీ మొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ మరోసారి తెలుగు సినిమాలో అది కూడా అల్లు అర్జున్ తో కలసి చిందేసే అవకాశం కావడం విశేషం.

Related posts