telugu navyamedia
సినిమా వార్తలు

200 కోట్లను కొల్లగొట్టిన “కబీర్ సింగ్”

Kabir-SIngh

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా “కబీర్ సింగ్” టైటిల్ రీమేక్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాపై బాలీవుడ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా… అమెరికాలో ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రెండో వారం నుంచి (జూన్‌ 28న) 45 సెంటర్లను పొడిగించారు. ప్రస్తుతం “కబీర్ సింగ్” చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొత్తానికి 13 రోజుల్లోనే 200 కోట్లను వసూలు చేసింది. అయితే సల్మాన్ భారత్ సినిమాకు మాత్రం అందుకు 14రోజుల సమయం పట్టడం గమనార్హం. 5 రోజుల్లో 100కోట్లను కొల్లగొట్టిన కబీర్ సింగ్ ఆ తరువాత మరో 9 రోజుల్లో వంద కోట్లను కొల్లగొట్టేశాడు. షాహిద్ కపూర్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ గ్రాసర్. ఈ సక్సెస్ తో హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ కైరా అద్వానీ రెమ్యునరేషన్స్ పెంచారని, దర్శకుడు సందీప్ వంగాకు సైతం బాలీవుడ్ బడా ప్రొడక్షన్స్ నుంచి అవకాశాలు వస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.

Related posts