telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాహుల్ నామినేష‌న్ పై అభ్యంత‌రాలు

rahul gandhi to ap on 31st

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అమేథీలో నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే. అయితే నామినేష‌న్ ప‌త్రంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. దీంతో రాహుల్ నామినేష‌న్ ప‌త్రాల త‌నిఖీని ఆ నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ వాయిదా వేశారు. బ్రిట‌న్‌లో రిజిస్ట‌ర్ అయిన కంపెనీ ప్ర‌కారం.. రాహుల్‌కు ఆ దేశ పౌర‌స‌త్వం ఉన్న‌ట్లు తెలుస్తుందని ఆరోపించారు.

అంటే ఈ దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ పౌరుడు కాదు అని, అందుకే ఆయ‌న ఎన్నిక‌ల‌కు అన‌ర్హుడు అంటూ న్యాయ‌వాది ర‌విప్ర‌కాశ్ ఆరోపించారు. రాహుల్ స‌మ‌ర్పించిన విద్యార్హ‌త ప‌త్రాల్లోనూ అనేక త‌ప్పులు ఉన్నాయ‌ని, ఒరిజిన‌ల్ విద్యా ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. దీంతో రాహులు నామినేషన్ నామినేష‌న్ ప‌త్రాల పరిశీలనను ఎన్నికల అధికారులు ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.

Related posts