telugu navyamedia
క్రీడలు వార్తలు

చాహల్‌ ఇంట్లో కరోనా కలకలం…

మన దేశంలో ఈ కరోనా సెకండ్ వేవ్‌లో మాత్రం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా మహమ్మారి సోకుతుంది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ తల్లిదండ్రులు కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని చాహల్‌ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేసింది. చాహల్‌ తల్లి స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. చాహల్‌ తండ్రికి మాత్రం లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. ఇదే విషయంపై ధనశ్రీ మాట్లాడుతూ.. మా మామగారు, అత్తగారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అత్తయ్య స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మామయ్య పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ ఇంట్లోనే ఉండండి.. మాస్క్‌ ధరించి క్షేమంగా ఉండండి’అంటూ పేర్కొంది. అయితే ఇటీవలే మాజీ క్రికెటర్లు పియూష్‌ చా‍వ్లా, ఆర్‌పీ సింగ్‌లు కరోనాతో తమ తండ్రులను కోల్పోయిన విఫయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ తాత్కాలికంగా రద్దు కావడంతో చాహల్‌ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు.

Related posts