telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ .. ఇంటర్మీడియేట్‌ ఫలితాలు.. మళ్ళీ బాలికలదే హవా..

ap intermediate results

ఆంధ్రప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియేట్‌ ఫలితాలు విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు సంవత్సరాల ఫలితాలను ఈరోజు 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మీ అమరావతిలోని ఏపీ సచివాయం సమావేశ మందిరంలో విడుదల చేశారు. గత ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రభుత్వం గ్రేడింగ్‌ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అంటే ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు తొలిసారి గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు.

రెండేళ్ల విద్యార్థులు మొత్తం 10,17,600 మంది పరీక్ష రాశారు. ద్వితీయ సంవత్సరంలో 72 శాతం; బాలికలు 75శాతం, బాలురు 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 60 శాతం విజయం సాధించారు. మే 14 నుండి సప్లిమెంటరీ.

Related posts