telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని “గ్యాంగ్ లీడర్” ట్రైలర్… థ్రిల్లర్ జోనర్ లోనే ఉన్నాడు… !

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ‌.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌. బామ్మ‌, స్వాతి, ప్రియ‌, వ‌ర‌ల‌క్ష్మి, చిన్ను మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. మ‌రోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. “ఆర్ఎక్స్ 100” ఫేమ్ కార్తికేయ కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా “గ్యాంగ్ లీడర్” ట్రైలర్ బయటకు వచ్చింది. ఐదుగురు ఆడవాళ్ల గ్రూప్‌నకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ట్రైలర్ లోని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts