నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే హిందూపురం చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నేడు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన ముఖ్య అనుచరులు, పార్టీ నేతలతో బాలకృష్ణ సమావేశమవుతారని తెలిపాయి.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలయ్య, మరోసారి హిందూపురం నుంచే పోటీ పడతారా? లేక మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అన్న విషయమై ఇంకా పూర్తి స్పష్టత లభించలేదు. అందుకే సొంత నియోజక వర్గంలో మకాం వేసి, ఈ సారి కూడా గెలుపుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టే ఉంది. ఇక తాజా ఎన్టీఆర్ బయోపిక్ మాదిరి రాబోయే ఎన్నికలలో బాలకృష్ణ కు డిపాసిట్లు కూడా రాకపోవచ్చనే సందేహం ఇప్పటికే కలిగినట్టు తెలుస్తుంది. అందుకే ఇక నుండి సొంత నియోజక వర్గంపై దృష్టిపెట్టనున్నట్టు సమాచారం.
ఈసారి మోదీ హవా ఉండదు: ఒవైసీ