telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీలంక సింగర్ నోట “కేజిఎఫ్” సాంగ్… నెటిజన్లు ఫిదా

Hansini

కన్నడ క్రేజీ స్టార్ యష్ నటించిన “కేజిఎఫ్” సినిమాను ఇటీవలే కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విజయవంతమైంది. ఘ‌న‌ విజ‌యం సాధించిన ద‌క్షిణాది చిత్రం “కేజీయ‌ఫ్” క‌న్న‌డ స్టార్ హీరో యష్ ఈ సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. త్వ‌ర‌లో “కేజీఎఫ్‌” చాప్ట‌ర్‌-2 ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంద‌ని షూటింగ్ స‌మ‌యంలోనే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చాప్ట‌ర్‌-2 షూటింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాగా… కన్నడ మ్యూజిక్ డైరెక్టర్లు… చాలా పాటలకు సింగర్లను బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచీ రప్పిస్తుంటారు. అఫ్‌కోర్స్ కన్నడిగులు కూడా ఆ సింగర్స్ స్వీట్ వాయిస్‌కి ఫిదా అయిపోయారు. తాజాగా KGF చాప్టర్-2 కోసం రాసిన “సప్తసాగరద మమ్మ” అనే సాంగ్ ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇందుకు కారణం KGF సినిమా కాదు ఈ పాటను ఓ శ్రీలంక సింగర్ పాడటమే. కన్నడ భాషలో శ్రీలంక సింగర్ హన్సినీ విమల్సిరి అత్యంత చక్కగా పాడటంతో కన్నడిగులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ సాంగ్‌ను నెటిజన్లు తెగ చూస్తున్నారు. ఆమె ఎంతో మెలోడియస్‌గా పాడిందనీ, స్వరాలన్నీ చక్కగా పలికిందనీ, ఫీల్ కలిగిస్తోందనీ అంటున్నారు. శ్రీలంక కోక్ స్టూడియోలోని జరిగిన యాంబియంట్ లక్సే సీజన్-1లో ఈ సాంగ్ పాడి వినిపించింది హన్సినీ. 3.14 నిమిషాల ఈ పాటని ఇప్పటికే 50వేల మందికి పైగా చూశారు. ఈ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

Related posts