telugu navyamedia
రాజకీయ

సిద్దరామయ్యకు చేదు అనుభవం..రూ. 2 లక్షలు విసిరికొట్టిన మహిళ

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ అల్ల‌ర్ల ఘటనలో గాయపడినవారికి సాయం చేస్తుండ‌గా ఒక మ‌హిళ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

వివ‌రాల్లోకి వెళితే..

కెరూర్‌లో అల్ల‌ర్ల‌లో గాయ‌ప‌డిన‌వారికి పరామర్శించేందుకు ఆయన బాగల్​కోటేలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రుని కుటుంబానికి రూ.2 లక్షలను నష్టపరిహారాన్ని ఇచ్చి ఆయన కారు ఎక్కుతుండగా ఓ ముస్లిం మహిళ ఎస్కార్ట్ వాహనంపైకి ఆ డబ్బులను విసిరేసింది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే నాయ‌కులు ఓట్లు అడిగేందుకు వ‌స్తారు.. ఇప్పుడు స‌మ‌స్య‌లేవీ ప‌ట్టించుకోరంటూ స‌ద‌రు మ‌హిళ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హిందువులైనా, ముస్లింలైనా అంద‌ర్ని స‌మానంగా చూడాలంటూ వాపొయింది. రాజ‌కీయ నాయ‌కుల ఓదార్పు అవ‌స‌రం లేద‌ని , ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఏ త‌ప్పు చేయ‌క‌పోయినా ..కార‌ణం లేకుండా త‌మ వారిపై దాడి చేశార‌ని బోర‌మంది. గాయ‌ప‌డ్డ‌వారు ఏడాది పాటు రెస్ట్ తీసుకోవాల‌ని ..డ‌బ్బు త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాద‌ని పేర్కొంది. భిక్షాట‌న చేసి అయినా త‌న కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపింది.

Kerur violence: Woman throws Rs 2 lakh given by Siddaramaiah 'on  humanitarian grounds'

కెరూర్​లో ఈవ్ టీజింగ్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని కత్తితో పొడిచారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు సంబంధించిన 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts