telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌పాయిజన్‌..200 మందివిద్యార్థులకి తీవ్ర అస్వ‌స్థ‌త‌

*బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌పాయిజన్‌

*ఈ-1 ఈ-2 మెస్‌లోఫుడ్ పాయిజ‌న్‌
*200 మందివిద్యార్థులకి తీవ్ర అస్వ‌స్థ‌త‌
*నిజామాబాద్ ఆస్ప‌త్రిలో త‌ర‌లింపు
*ఫుడ్ పాయిజ‌న్‌పై మంత్రి స‌బితా ఆరా
*ఫుడ్‌పాయిజన్‌పై పూర్తిస్థాయి విచారణ
*బాధ్య‌తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశం
*ఇలాంటి ఘ‌ట‌న‌లు పునారావృతం కాకుండా చ‌ర్య‌లు

బాసర ట్రిపుల్‌ ఐటీలో శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ-1 ఈ-2 మెస్‌లోఫుడ్ పాయిజ‌న్ అయిన‌ట్లు గుర్తించారు.

ఫ్రైడ్‌ రైస్‌ తిని వాంతులు, విరోచనాలలతో రెండు వంద‌ల మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. వాళ్లందరినీ చికిత్స కోసం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన గురించి తెలిసిన తల్లిదండ్రులు.. మెస్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు .

ఇదిలా ఉంటే.. ఘటనపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు . విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని బాసర ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్‌పాయిజన్‌పై పూర్తిస్థాయి విచారణ జరపుతామని, బాధ్యులపై క‌ఠినచర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.

Related posts