వరద సాయం కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని చెప్పారు. ఇంకా వరద సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందన్నారు. ధ్రువీకరణ చేశాక వారి ఖాతాల్లో నేరుగా వరద సాయం జమ చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఇది ఉండగా… వరద సహాయం భాదితులు ఆందోళన చేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ సీమపంలోని మీసేవ వద్ద 10 రూపాయలు వరద సహాయం పొందని భాదితులు ఆందోళన నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన కు వచ్చిన భాదితులను చెదరగొట్టారు పోలీసులు. లాక్ డౌన్ ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదే విధంగా 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సెకెండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు కానీ.. నిజమైన భాదితులకు అన్యాయం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
previous post
ప్రజల జీవితాలతో “కేసీఆర్ అండ్ కో” ఆడుకుంటున్నారు: విజయశాంతి