telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పెన్షన్‌ దారులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌…

cm jagan ycp

ఏపీలోని పెన్షన్‌ లబ్దిదారులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైయస్‌ఆర్‌ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఫిబ్రవరి నెల పెన్షన్ మొత్తాలను మార్చి 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1478.83 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాల పంపిణీ చేసింది. సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేయనున్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్దంగా వున్నట్లు సెర్ప్ సిఇఓ పి.రాజబాబు తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్‌బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ ను కూడా పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related posts