telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సీటు ఇస్తానంటే.. బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు…! ఇదేమి విడ్డురం.. !!

TDP Candidate withdraw Badwel

ఎన్నికల వేళ టికెట్ ల కోసం ఆయా అభ్యర్థులు పడరాని పాట్లు పడుతుండటం చూస్తుంటాం.. అలా ఆశించిన వారికి టికెట్ దక్కటపోతే అనేది వేరే విషయం, కానీ పిలిచి సీటు ఇస్తాను అంటుంటే, పారిపోతున్నారట ఈ అభ్యర్థులు. ఆ వివరాలు ఏమితో చూడండి.. రాజంపేట ఎంపీగా దివంగత డీకే ఆదికేశవుల నాయుడు తనయుడు డీకే శ్రీనివాసులను చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా కొన్నాళ్ల కిందటే వార్తలు వచ్చాయి. కానీ ఆయన ససేమేరా అంటున్నారని సమాచారం! రాజంపేటలో పోటీ చేసేది ఓడిపోవడానికే అని.. అలాంటి చోట తాము ఎందుకు పోటీ చేస్తామని వారు అంటున్నారట.

ఇక నెల్లూరు ఎంపీ సీటు విషయంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరు ఖరారు అయిపోయిందన్నారు. అతను కూడా వెనుకంజ వేస్తుండటంతో, తాజాగా, మాగుంటను బరిలోకి దించడానికి ప్రయత్నాలలో ఉన్నారట. మాగుంట కూడా అందుకు రెడీగా లేరని స్పష్టం అవుతోంది. ఇక ఒంగోలు ఎంపీ సీటుకు కూడా ఏవేవో లెక్కలు వేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎంపీ సీటుకు అభ్యర్థిని రెడీ చేసుకోవడం అంత తేలికగా కనిపించడం లేదు. అంతేకాదు.. తిరుపతి ఎంపీ సీటు పరిధిలో కూడా పరిస్థితి ఇలానే ఉందని సమాచారం. దీనితో అధికార పార్టీ తరపున పోటీకి దిగడానికే అభ్యర్థులు కరువు అన్నట్టుగా టీడీపీ పరిస్థితి ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Related posts