దేశంలోనే తక్కువ వయసు ఐపీఎస్ అధికారిగా గుజరాతీ యువకుడు హసన్ సఫిన్ రికార్డు సృష్టించనున్నారు. గత ఏడాది నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఆయన 570వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న హసన్ ఈ నెల 23న జామ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
హాసన్ మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ కావాలన్నది తన అసలు లక్ష్యమని.. కానీ, వరుస ప్రయత్నాల్లోనూ ఐఏఎస్‌కు ఎంపిక కాలేకపోవడంతో ఐపీఎస్‌ను ఎంచుకున్నానని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన హసన్ సొంతూరు పాలంపూర్‌లోని కానోదర్ గ్రామం. తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీం బాను స్థానికంగా ఉన్న చిన్న వజ్రాల పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. హసన్ చదువు కోసం వారెంతో కష్టపడ్డారు.
అల్లు కాంపౌండ్… “పేట” నిర్మాతలకు వార్నింగ్