telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ రాజధానిలో .. అప్పుడే డ్రగ్స్ మాఫియా మొదలు.. విద్యార్థులే లక్ష్యం.. తస్మాత్ జాగర్త !

Drugs

అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న నగరాలలో డ్రగ్స్ వంటి చీకటి ప్రపంచం చాలా వేగంగా వ్యాపిస్తుండటం చూస్తూనే ఉన్నాం.. అయితే ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్న ఏపీ రాజధానికి అతిసమీపంలో అప్పుడే డ్రగ్స్ కోరలు విప్పాయి. విద్యార్థులే లక్ష్యంగా కాటేస్తున్నాయి. తాజా పోలీసుల సోదాల్లో మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక కార్పోరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో నలుగురు విద్యార్థులు రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నేత మంత్రులు..ప్రభుత్వ పెద్దలు అందరూ కొద్ది వేటు దూరంలో ఉండే ఈ ప్రాంతంలో మత్తు పదార్ధాలు దొరకటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రక్త నమూనాలు సేకరించిన విద్యార్దులను ఆరా తీస్తున్నారు. వారి రక్త పరీక్ష నివేదికలు వచ్చిన తరువాత పూర్తి సమాచారం తెలుస్తుంది పోలీసులు చెబుతున్నారు. అయితే కార్పోరేట్ కాలేజి విద్యార్దులను లక్ష్యంగా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారా..లేక స్థానికుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. అయితే..ఈ వ్యవహారం బయటకు రావటంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ ప్రారంభం అయింది.

పోలీసులు స్థానికంగా ఒక కార్పోరేట్ కాలేజీలోని విద్యార్ధులు నలుగురి దగ్గర డ్రగ్స్ గుర్తించారు. అయితే..ఇవి వారికి ఎక్కడి నుండి వచ్చాయి.. ఎవరి ద్వారా ఇక్కడకు తీసుకొచ్చారు.. నిజంగా అవి మత్తు పదార్ధాలేనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సమాచారం బయటకు రాగానే పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అధికారులను ఆదేశించారు. గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలంతో ఫేమస్ పర్సనాల్టీలు పేర్లు వెలుగులోకి వచ్చాయి. విచారణలు ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతంగా ఉండే మంగళగిరి ప్రాంతంలో ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Related posts