telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-3″కి అదిరిపోయే రేటింగ్స్

Bigg-Boss-3

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం తెలుగు సీజ‌న్-3… నాగార్జున హోస్ట్‌గా 15 మంది సెల‌బ్రిటీల‌తో జూన్ 21న మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి ఇంట్లోకి ప్ర‌వేశించారు. ఆసక్తికర టాస్కులతో ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్. అయితే ఈ వివాదాస్పద టీవీ రియాల్టీ షో రేటింగ్ విషయంలో అదరగొట్టింది. ఏకంగా ఈ సీజన్ లాంచ్ ఎపిసోడ్ 17.9 టిఆర్పి రేటింగ్స్ ను రాబట్టి టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ లాంచింగ్ రేటింగ్ ఎక్కువ కావడం విశేషం. 2017లో ఈ షో తెలుగు ప్రజల ముందుకు రాగా… మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరించాడు. ఆ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు 16.18 టిఆర్పి రేటింగ్స్ వచ్చాయి. ఎన్టీఆర్ ఈ షోను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయడంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు. ఇక భారీ అంచనాల మధ్య గత ఏడాది బిగ్ బాస్-2 ప్రారంభం కాగా నేచురల్ స్టార్ నాని ఆ సీజన్ కు వ్యాఖ్యాత గా వ్యవహరించాడు. ఆ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు 15.05 టిఆర్పి రేటింగ్స్ వచ్చాయి. అయితే నాని షో నడిపిన తీరుఫై ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్-3 స్టార్ట్ కాగా కింగ్ నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లాంచ్ ఎపిసోడ్ అన్ని సీజన్ల కంటే ఎక్కువగా 17.9 టిఆర్పి రేటింగ్స్ ను రాబట్టిందని స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది. దాంతో నాగ్ హోస్టింగ్ ఫై హ్యాపీగా వున్నారు షో నిర్వాహకులు.

Related posts