telugu navyamedia
సినిమా వార్తలు

హీరోయిన్ లిప్ లాక్… భర్త అప్సెట్

Poojitha-Ponnada

షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న పూజిత పొన్నాడ ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటోంది. గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్న “రంగస్థలం” సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది పూజిత. ఇప్పుడు లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వేరీజ్ వెంకటలక్ష్మీ” సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ స్టోరీతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. పూజితకు జంటగా బుల్లితెర నటుడు రామ్ కార్తీక్ నటించాడు.

ట్రైలర్ లో వీరిద్దరి లిప్ లాక్ సీన్ హైలెట్ అయ్యింది. దీంతో ట్రైలర్ కు మంచి వ్యూస్ లభించాయి. కానీ పూజితం భర్త మాత్రం ఈ ట్రైలర్ చూసి బాగా అప్సెట్ అయ్యాడని సమాచారం. పూజిత పొన్నాడకు పెళ్ళైన విషయం సినీ జనాలకు పెద్దగా తెలియదు. ఆమె కూడా సినిమా అవకాశాల కోసం ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది. దాదాపుగా పెళ్ళైన హీరోలంతా ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు దూరంగా ఉంటారు. కానీ పూజిత మాత్రం రివర్స్ లో వెళ్తోంది.

Related posts