ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పెళుతున్నాయి. ఒకరి పై మరొకరి విమర్శలతో శాసనసభ దద్దరిల్లిపోతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 40 రోజుల పాలనలో జగన్ ఫ్యాక్షన్ నేతగానే వ్యవహరించారని విమర్శించారు.
ప్రజావేదిక తరహాలో రాష్ట్రంలోని నదీ తీరాల్లో ఉన్న 73వేల కట్టడాలను కూల్చాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. విజయవాడలోని కృష్ణలంకను, గోదావరి తీరంలోని వివిధ మతాల ఆధ్యాత్మిక కేంద్రాలనూ ప్రభుత్వం తొలగించగలదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక్కో తప్పుకు మరో వంద తప్పులు చేస్తున్నారని విమర్శించారు.