telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

త్రైపాక్షిక సమావేశం మొదలు…

ఈ ఏడాది శ్రీలంకలో సముద్ర రక్షణపై త్రైపాక్షిక సమావేశం మొదలయింది. అందులో శ్రీలంక, మాల్దీవులు, భారత్‌లు పాల్గొంటున్నాయి. ఈ సమావేశానికి శ్రీలంక విదేశాంగ మంత్రి దినేష్ గునవర్దేనా ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సమావేశంలో దేశం తరుపున జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. అదేవిదంగా మాల్దీవుల విదేశాంగ మంత్రి మరియా దిది, శ్రీలంక రక్షణ సెక్రటరీ మేజన్ జనరల్ కమల్ గునారత్నే తమతమ దేశాల తరుపున సమావేశానికి వచ్చారు. ఈ సమావేశం ద్వారా ఈ మూడు దేశాలు తమతమ సముద్ర జలాలు, రక్షణలకు సహకరించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాకుండా సముద్ర రక్షణ సహకారంపై ఎన్ఎష్ఏ స్తాయిలో జరిగిన మొట్టమొదటి త్రైపాక్షిక సమావేశం. హిందూసముద్రపు దేశాలలో త్రైపాక్షిక సమావేశాలు మంచి ఫలితాలను ఇచ్చాయని అన్నారు. ప్రస్తుత సమావేశం ద్వారా ఆరు సంవత్సరాల బంధం మళ్లీ వస్తుందని అన్నారు. మునుపటి త్రైపాక్షిక సమావేశాలు 2011లో మాల్దీవులలో, 2013లో శ్రీలంక, 2014లో భారత్‌లో జరిగింది. ఈసారి ఈ సమావేశం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.

Related posts