ఏపీఎస్‌ఆర్టీసీకి రూ. 6500 కోట్లు అప్పులున్నాయని రవాణాశాఖా మంత్రి పేర్నినాని అన్నారు. కార్మికుల పీఎఫ్ నిధుల కూడా వాడేశారని, ఆర్టీసీని ఆదుకోవాలని ఆర్టికశాఖను కోరామన్నారు. మరోసారి స్పష్టమైన ప్రతిపాదనలతో ఆర్థికమంత్రిని కలుస్తామని ఆయన తెలిపారు. రవాణాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరామని పేర్నినాని చెప్పారు.
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ విలీనంలో భాగంగా ఆరుగురు సభ్యులతో కూడిన అధ్యయన కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్టీసీ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనతో ప్రభుత్వానికి నివేదిక అందచేయనుంది.
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా