తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళుతున్న సమయంలో ఆయనకు బీపీ లెవెల్స్ పడిపోయాయి. దీంతో అకస్మాత్తుగా ఆయన కిందపడిపోయారు.
పక్కనే ఉన్న ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ గరికపాటికి వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు.అనంతరం ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా గరికపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్