మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట లభించింది. ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని..ఈ మేరకు తమకు సమాచారం ఇవ్వాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కొహ్లీ ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసు విచారణ వేర్వేరు పిటిషన్లతో ముడిపడివున్నందున రాజ్యాంగబద్ధ బెంచ్ ఏర్పాటు అవసరమని, ఈ పిటిషన్ల లిస్టింగ్‌కు కొంత సమయం అవసరమని తెలిపింది..త్వరలోనే ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తాం. కొత్త బెంచ్ ఎప్పుడు ఏర్పాటు అవుతుందో ఇప్పుడే చెప్పలేం’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
వాస్తవానికి సోమవారం విచారణ జరగాల్సిన నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. పిటిషన్లు అన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ చేస్తామన్న సీజేఐ ఎన్‌వీ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది.