కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం తొమ్మిదికి పైగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీగా ఉన్నారు. తెలుగులో “సైరా” చిత్రంతో పాటు వైష్ణవ్ తేజ్ సినిమా చేస్తున్న విజయ్ సేతుపతి ఇటీవల 96, సూపర్ డీలక్స్ అనే చిత్రాలతో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా విజయ్ డైలాగ్ రైటర్‌గా మారాడట. గతంలో “ఆరెంజ్ మిట్టాయి” అనే చిత్రానికి విజయ్ సేతుపతి డైలాగ్స్ అందించగా, ఈ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికి మరోసారి స్పేస్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనున్న “చెన్నై పలని మార్స్” అనే చిత్రానికి విజయ్ సేతుపతి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త నటీనటులు నటిస్తుండగా, ఈ చిత్రాన్ని రూరల్ బ్లాక్ కామెడీ మూవీగా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. “ఆరెంజ్ మిట్టై” దర్శకుడు బిజు విశ్వనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సారి విజయ్ డైలాగ్ రైటర్‌గా కూడా విజయ్ తన సత్తా చాటుకుంటాడని భావిస్తున్నాయి తమిళ వర్గాలు.
previous post
next post
డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్..