telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ హీరోయిన్ కు 6 నెలల జైలు శిక్ష

Koina

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కొయినా మిత్రాకు ఏకంగా ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. చెక్ బౌన్స్ కేసులో కొయినాకు ఈ శిక్ష పడింది. 2013లో చేసిన అప్పు కాస్తా ఇప్పుడు మిత్రా మెడ‌కు చుట్టుకుని జైలు శిక్ష పడేలా చేసింది. మోడ‌ల్ పూన‌మ్ సేథీ వద్ద 2013లో 22 ల‌క్ష‌ల‌ను అప్పుగా తీసుకుంది కొయినా మిత్రా. ఆ త‌ర్వాత అప్పును ఒప్పందం ప్రకారం తిరిగి చెల్లించేయాలని భావించిన కొయినా 2013లో 3 ల‌క్ష‌ల చెక్ ఇచ్చింది. అయితే అది కాస్తా బౌన్స్ అయింది. దాంతో అదే ఏడాది జులైలో కొయినాకు లీగ‌లో నోటీస్ పంపించింది పూన‌మ్. ఆ అప్పు కాస్తా ఇప్ప‌టికి వ‌డ్డీ ల‌క్షా 64 వేల‌తో క‌లిసి 4.64 ల‌క్ష‌లు అయింది. కోర్ట్ కూడా ఈ కేసులో నిజానిజాలు ప‌రిశీలించిన త‌ర్వాత ఇప్పుడు ఆమెకు ఆర్నెళ్ల జైలు విధించింది. అయితే కొయినా మిత్రా మాత్రం త‌న‌కు ఏ పాపం తెలియ‌దు. త‌న‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నారంటూ మీడియా ముందుకొచ్చింది. మరి ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై కూడా చీటింగ్ నమోదైన విషయం తెలిసిందే.

Related posts