టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఇంటికి కోడలైనప్పటికీ గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించలేదు. అదే గ్లామర్ తో అదే జోరుతో వరుస సినిమాలు చేసి భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. అక్కినేని మూడోతరం వారసుడు నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత సమంత వరుస సక్సెస్‌లు సాధిస్తుంది. ఇటీవల “మజిలీ”, “ఓ బేబి” చిత్రాలతో ప్రేక్షకులని పలకరించిన సమంత ప్రస్తుతం “96” రీమేక్ చిత్రంలో నటిస్తుంది. తమిళ వర్షెన్‌ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శర్వానంద్ చిత్రంలో కెమెరామెన్‌గా కనిపించనున్నాడు. వివాహం తర్వాత గ్లామరస్ పాత్రలు తగ్గించి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలపై సమంత దృష్టి సారించింది. దీంతో వరుస విజయాలతోపాటు మంచి నటిగా గుర్తింపు కూడా సంపాదించుకుంది. త్వరలో మరో విభిన్న పాత్రలో సమంత కనిపించబోతోందట. ఇప్పటివరకు అన్నీ పాజిటివ్ పాత్రలే చేసిన సమంత త్వరలో ఓ నెగిటివ్ రోల్‌లో కనిపించనుందట. అయితే అది వెండితెరపై కాదు.. డిజిటల్ స్క్రీన్‌పై. అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ హిట్ అయిన తెలుగు వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మెన్`. ఈ సిరీస్ రెండో సీజన్‌లో సమంత నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఆమె విలన్ పాత్రలో నటిస్తోందట. టెర్రరిస్ట్‌గా కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ వెబ్ సిరీస్‌కు మరింత ఆదరణ లభించడం ఖాయం.
previous post
next post