telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుట్టినరోజు సందర్భంగా 3 లక్షల ఉద్యోగాలు… సోనూసూద్ ప్రకటన

Sonu-Sood

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న రియల్ హీరో సోనూసూద్ పుట్టిన రోజు జూలై 30న. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఇక ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ప్రవాసీ రోజ్ గార్’ పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టనున్నామని అందుకోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఈ ఉద్యోగులందరికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తామని సోనూ వెల్లడించాడు.

Related posts