telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వేశ్యగా టబు… 24 ఏళ్ళ యంగ్ హీరోతో రొమాన్స్…!

Tabu

గత జనరేషన్ లో తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో గ్లామరస్ హీరోయిన్‌గా యువకుల హృదయాలను కొల్లగొట్టారు టబు. ఇప్పుడు ఆమె వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “అల వైకుంఠపురంలో” అనే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మొదటిసారిగా టబు ఓ వేశ్య పాత్రలో నటించబోతున్నారు. అంతేకాదు 24 ఏళ్ల బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖత్తర్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎ సూటబుల్ బాయ్’. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడైన ఇషాన్ తనకు తల్లి వయసున్న నటితో కలిసి రొమాన్స్ చేయబోతుండడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. లుక్‌లో టబు ఉయ్యాలపై వయ్యారంగా కూర్చుని ఉంటే పక్కన ఇషాన్ బోర్లపడుకుని ఆమె అందాన్ని తనివితీరా చూస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. విక్రమ్ సేథ్ రాసిన ‘ఎ సూటబుల్ బాయ్’ నవల ఆధారంగా సినిమాను మీరా నాయర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంతకీ సినిమా కథ ఏంటంటే.. మాన్ కపూర్ (ఇషాన్ ఖత్తర్) మహేష్ కపూర్ (రామ్ కపూర్) అనే పేరున్న రాజకీయనాయకుడి కుమారుడు. ఎవరికీ బెదరడు. అడ్డొచ్చినవాళ్లని కొట్టిపడేస్తుంటాడు. అలాంటిది సయ్యదా బాయ్ (టబు) అనే వేశ్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె అందానికి ముగ్దుడైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ. సినిమాను ఓ మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్నారు కాబట్టి టబు, ఇషాన్ ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Related posts