telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బ్లాక్ పాంథర్” హీరో చాడ్విక్ బోస్మాన్ మృతి

Black-Panther

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన “ఎవెంజర్స్”లో ఒకరైన “బ్లాక్ పాంథర్” నటుడు చాడ్విక్ బోస్మాన్ మరణించాడు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ 43 ఏళ్ళ నటుడు పెద్ద ప్రేగు క్యాన్సర్‌ తో పోరాడుతూ మరణించాడని ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలో అతను తన ఇంటిలో, అతని భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా మరణించాడని పేర్కొన్నారు. ఈ నటుడు నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. 2016 నుండి స్టేజ్ త్రీ ప్రేగు క్యాన్సర్‌ తో బాధపడుతున్నాడు. 2016లో రిలీజ్ అయిన “కెప్టెన్ అమెరికా: సివిల్ వార్”లో మార్వెల్ సూపర్ హీరో “బ్లాక్ పాంథర్”గా కనిపించిన తరువాత బోస్మాన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇక ఆ సినిమాలో పాత్రనే అతను అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ మరియు ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌ లో కూడా పోషించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దర్శకుడు స్పైక్ లీ డా 5 బ్లడ్స్‌లో అతని చివరి సినిమా.

Related posts