telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డకు కాకాణి గోవర్ధన్ సంకేతాలు…

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై త్వరలో ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్. ఆయన మాట్లాడుతూ… మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత నిమ్మగడ్డకు లేదు. నిమ్మగడ్డ అప్రజాస్వామిక వైఖరి చూసే మంత్రులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులను విచారణ చేయాలని కమిటీ నిర్ణయించింది. అసెంబ్లీ, ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలను నిమ్మగడ్డ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేడు. గవర్నర్ వెంటనే నిమ్మగడ్డ ను బర్తరఫ్ చేయాలి. ఎస్ఈసీ వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కానుంది. భారీ మూల్యం చెల్లించుకోవటానికి రమేష్ కుమార్ సిద్ధంగా ఉండాలి అని పేర్కొన్నారు. ఎస్ఈసీ వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కానుందన్న ఆయన భారీ మూల్యం చెల్లించుకోవటానికి రమేష్ కుమార్ సిద్ధంగా ఉండాలని అన్నారు. తనను ఈనెల 21 వరకు హౌస్ అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి నిన్నటి రోజున హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.  ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని, మంత్రిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడం రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసి ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.  పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ కు సంబంధించిన ఆదేశాలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. 

Related posts