telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పెరుగుతున్న లోన్ యాప్ బాధితుల సంఖ్య… ఒక్క రోజే 100కు పైగా కేసులు

తెలంగాణలో రోజు రోజుకు కాల్ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే 16 కేసులు నమోదవగా… హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో నిన్న 39 లు కేసులు నమోదయ్యాయి. అటు రాచకొండ సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే 30 లు కేసులు నమోదయ్యాయి. మూడు కమిషనర్‌లోని సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే వంద కేసులు నమోదయ్యాయి. డబ్బులు చెల్లించమని బూతులు తిడుతూ లోన్ యాప్ ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నారు. ఇంట్లోని మహిళలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న లోన్ ప్రతినిధులు… ఫోన్ లోని డాటాను యాక్సెస్ చేస్తున్నారు కేటుగాళ్లు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోన్ సంస్థల వివరాలు సేకరిస్తున్న పోలీసులు… గతంలో చైనా నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అనుమతులు పొందిన కొన్నింటిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. డబ్బులు వసూలు చేయడానికి థార్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు…వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు బాధితులు చేసుకుంటున్నారు.

Related posts