telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్… కపిల్ దేవ్ లా మారిపోయిన రణ్వీర్ సింగ్

83

భార‌త‌దేశ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 ఏడాదిని మ‌ర‌చిపోలేం. క‌పిల్ దేవ్ నాయ‌క‌త్వంలో తిరుగులేని వెస్టీండిస్ టీమ్‌పై విజ‌యాన్ని సాధించిన క్రికెట్ విశ్వ‌విజేత‌గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించిన సంవ‌త్స‌ర‌మది. తొలిసారి ప్ర‌పంచ క్రికెట్ క‌ప్పును భార‌తావ‌ని ముద్దాడిన ఏడాది 1983. ఈ ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుద‌ల చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ర‌ణ్వీర్ సింగ్‌ ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ర‌ణ్వీర్ సింగ్ క‌పిల్‌దేవ్‌లా మేకోవ‌ర్ అయ్యారు. త‌న శ‌రీరాకృతిని ఓ క్రీడాకారుడిగా మార్చుకోవ‌డానికి ఆయ‌న ప‌డ్డ క‌ష్టం మ‌న‌కు తెర‌పై క‌న‌ప‌డుతుంది. ఫ్యాన్స్ కోసం క‌పిల్‌దేవ్‌లా ఉన్న ర‌ణ్వీర్ సింగ్ లుక్‌ను చిత్రీ యూనిట్ విడుద‌ల చేసింది. అది కూడా ఆయ‌న ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ న‌ట‌రాజ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పుడు ఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో దీపికా ప‌దుకొనె అతిథిపాత్ర‌లో న‌టిస్తున్నారు.

Related posts