telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి: మంత్రి తలసాని

talasani srinivasayadav on clp merger

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ప్రజలు గుంపులుగా ఉండొద్దన్నారు. వృద్దులు, చిన్నారులు ఇండ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. కరోనా నివారణ చర్యలపై అవగాహన పెంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలసి సూచించారు. అవసరమైతే వైద్యుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తమ కార్యాలయానికి ఫోన్‌చేసి సమస్యలు తెలియజేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Related posts