telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీసులపై ఓ సినిమా తీస్తా : దిల్ రాజు

Dil Raju

కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ అయ్యింది. కరోనో కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ కరోనా పై పోలీసులు, వైద్యుల త్యాగాలు వెల కట్టలేనివి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనాపై పోలీసుల పోరు గురించి ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన కథ కూడా సిద్ధంగా ఉందని పేర్కోన్నాడు. దిల్ రాజు నిన్న పోలీసు సిబ్బందికి రక్షణ మాస్కులు, శానిటైజర్లును పంపణీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా ఇళ్లలో ఉంటే పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. కరోనా కారణంగా విధించిన ఈ లాక్‌డౌన్‌ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుతూ ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని తెలిపాడు.

Related posts