telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇష్టంగా పచ్చిమిర్చి తినాలి.. అది కూడా ఎంతో .. ఆరోగ్యం.. తెలుసా..!

green chilli is very good for health

మిరపకాయ చూస్తేనే, దానిని పక్కన పెట్టి ఆహారం తీసుకుంటాం. అలాంటిది వాటిని కూడా తినాలంటే.. బాగా ఆలోచించాల్సిందే.. అంటే వీల్లేదు.. తినాల్సిందే అంటున్నారు నిపుణులు. అందులో కూడా పచ్చటి వాటిలో ఉండే పోషకాలన్నీ ఉంటాయట. అందుకే దానికి కూడా ఆహారంలో చేర్చుకోవాల్సిందే అంటున్నారు. సాధారణంగా మనం ప్రతి రోజు వంటల్లో పచ్చిమిర్చిని వాడుతూనే ఉంటాం. చాల మంది కూరల్లో ఎర్ర కారానికి బదులుగా పచ్చిమిర్చిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకొందరు వాటితో ఊరు మిరగాయలు వంటివి చేసుకొని తీసుకుంటారు. కొన్ని ప్రాంతాలలో అయితే వీటిని కూడా పెరుగులో నాచుకోడానికి ఉపయోగించడం చూస్తుంటాం.

రోజువారీ కూరల్లో పచ్చిమిర్చిని వాడటం వలన వంటకు మంచి రుచి వస్తుంది. ఈ పచ్చిమిర్చి తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…!

* పచ్చిమిర్చిలో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.

green chilli is very good for health* పచ్చిమిర్చిని గింజలతో కలిపి తినటం వలన జీర్ణశక్తి మెరుగుపడి, అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. చాలా మంది పచ్చిమిర్చిని ఉపయోగించినప్పుడు గింజలను తీసేస్తూ ఉంటారు. అలాంటి వారు గింజలు తీయకుండా తినటం అలవాటు చేసుకోవాలి.

* పచ్చిమిర్చి గింజల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం సమృద్ధిగా ఉండుట వలన రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించటమే కాకుండా పేగుల నుంచి కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా చూస్తుంది.

* పచ్చిమిర్చిలో క్యాప్సెయిసిన్ సమృద్ధిగా ఉండుట వలన మెటబాలిజం రేటును పెంచుతుంది. దాని తో క్యాలరీలు త్వరగా కరగటం వలన బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి చర్మ సమస్యలను తొలగిస్తుంది.

Related posts