telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జులై 1 నుంచి విద్యాసంస్థలు రీ-ఓపెన్ : సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రస్మా

Kcr telangana cm

గత పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపిన కరోనా సెలవుల కారణంగా విద్యార్థులకు కలిగిన తీవ్ర విద్యా నష్టాన్ని గుర్తించటమే కాక, విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలను , ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆవేదనను సహృదయంతో అర్థం చేసుకొని నేడు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, కేబినెట్ సహచరులతో జరిగిన క్యాబినెట్ సమావేశంలో విద్యాసంస్థల పున: ప్రారంభానికి అనుమతించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నిర్ణయాన్ని కృతజ్ఞతలతో స్వాగతిస్తూ పరిస్థితిని అర్థం చేసుకొని, సైరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న కెసిఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు తెలియజేశారు.

ఇన్ని నెలలుగా పాఠశాలకు దూరమై ఇప్పటివరకు పొందిన జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయే దశకు చేరుకున్న విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులకు ఈ పాఠశాలల పునఃప్రారంభం నిర్ణయం చల్లటి కబురు అందించినట్లు అయిందని, ఉదయం నుండి సాయంత్రం వరకు బాధ్యతతో తన కష్టాన్ని పంచి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయుల శ్రమ నీరుగారి పనికి రాకుండా పోయే సమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వెంటిలేటర్ పై జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణ విద్యా వ్యవస్థకు ఆక్సిజన్ అందించి ఊపిరిలూదినారని ఆయన ముఖ్యమంత్రి గారిని కొనియాడారు. దేశ చరిత్రలోనే ఇది అత్యంత సాహసోపేతమయిన నిర్ణయమని ఇది కేసీఆర్ గారి మార్కు నిర్ణయమని,ఇందుకు పేరుపేరునా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ సహచరులకు, విద్యాశాఖ మంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి, విద్యా శాఖ ఉన్నతాధికారులకు, ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్యారంగ సమస్యలను ఎప్పటికప్పుడు తమ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన మీడియా మిత్రులందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ముఖ్యమంత్రి గారి ప్రకటనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ ,రాష్ట్ర కోశాధికారి ఐ వి రమణ రావు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేసినారు.

ఈ పాఠశాలల పునఃప్రారంభం నిర్ణయాన్ని అనుసరించి విద్యాసంస్థల యాజమాన్యాలు తమ ప్రాంగణాల శుభ్రత విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలని, ప్రాంగణాన్ని పాఠశాల భవనం అంతటిని మరొకమారు శానిటైజర్ చేయించి అవసరమైన మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని కోరడమైనది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ పాఠశాల బస్సులు ఇతర వాహనములపై మరమ్మతులు కూడా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇంకొకవైపు గౌరవనీయులైన తల్లిదండ్రులందరూ కరోనా నియమాలను విద్యార్థులందరూ తప్పకుండా పాటించే విధంగా చూడాలని వారి ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు.

Related posts