సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రీమంకీస్’. అనిల్‌కుమార్ దర్శకుడు. కారుణ్యచౌదరి కథానాయిక. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై నగేష్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర లోగో, ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ నాగబాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల హీరో వెంకటేష్ చేతులు మీదుగా ప్రారంభించారు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లో సుధీర్, శ్రీను, రాంప్రసాద్ కామెడీ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, కారుణ్య చౌదరి ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక ట్రైలర్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ కామెడీతో పాటు షకలక శంకర్ కామెడీ కూడా అదిరిపోయింది. ఇక కారుణ్య చౌదరి మొదట సాఫ్ట్ గా ఉన్న తర్వాగ ఈ ముగ్గురుని భయపెట్టే సీన్ చూస్తుంటే సినిమాలో కామెడీ తో పాటు థ్రిల్లింగ్ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి సినిమా ఫుల్ లెన్త్ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.
previous post
పోటీ ప్రపంచంలో తెలుగు కంటే ఇంగ్లీషు అవసరమే ఎక్కువ: కత్తి మహేశ్