telugu navyamedia
సినిమా వార్తలు

వారసుడు నుంచి విజయ్‌ సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ ..

కోలీవుడ్‌ ప్రముఖ హీరో దళపతి విజయ్ , దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న మూవీ వార‌సుడు. ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటిస్తోంది.

ఈరోజు విజయ్ బర్త్ డే కానుకగా నిన్న సాయంత్రమే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్  చేసింది చిత్ర‌యూనిట్‌.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెకండ్  లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్  కూడా విడుదల చేసింది.

Vijay In And As Varasudu

ఈ సెకండ్​ లుక్​లో విజయ్​.. చూట్టూ పిల్లలు ,పండ్లు, కూరగాయలు ,చెరుకు గడలు ఉన్న ఎండ్ల బండిలో పడుకుని ఎక్కడికో బయలుదేరినట్టుగా కనిపిస్తున్నాడు . ‘ది బాస్​ రిటర్న్స్ ‘ అంటూ క్యాప్షన్​ జోడించింది.. కాగా  విజయ్‌ కొత్తలుక్‌ పలు సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. 

ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరిష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదలకానుంది.

విజయ్‌ నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రమిదే. ఆయన హీరోగా గతంలో తెరకెక్కిన ‘తుపాకి’, ‘సర్కార్’, ‘విజిల్‌’, ‘మాస్టర్‌’, ‘బీస్ట్‌’ తదితర చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ల‌భించింది.

Related posts