telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియాలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న బాలీవుడ్ బ్యూటీ

Prabhas

యంగ్ రెబల్ స్టార్ కు ఉన్న క్రేజ్ నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కు కూడగట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రభాస్ నటించే 21వ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయికగా నటించనుందంటూ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటన తర్వాత ప్రభాస్ ఇన్స్టాగ్రాంలో దీపికను ఫాలో అవడం మొదలెట్టాడు. దాంతో నిన్నటి నుంచి దీపిక కూడా ఇన్ స్టాలో ప్రభాస్ ని ఫాలో అవుతోంది. వాస్తవానికి ప్రభాస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఫాలోవర్లు దీపికకు వున్నారు. ఇన్స్టాలో 4.9 మిలియన్ల ఫాలోవర్లని కలిగివున్న ప్రభాస్ కేవలం ఐదుగుర్ని మాత్రమే ఫాలో అవుతుండగా, 50.7 మిలియన్ల ఫాలోవర్లు వున్న దీపిక 127 మందిని ఫాలో అవుతోంది. మొత్తానికి వీరిద్దరూ ఒకర్ని ఒకరు ఫాలో అవుతూ మంచి స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts