telugu navyamedia
సినిమా వార్తలు

ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు..

‘ఉప్పెన’తో హీరోగా పరిచయమై న పంజా వైష్ణవ్‌ తేజ్ మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు. రెండో ప్రయత్నం.. ‘కొండపొలం’ చిత్రంతో యువతలో స్ఫూర్తినింపిన ఆయన ప్రస్తుతం ‘రంగరంగ వైభవంగా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం విడుదల కాక ముందే మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చేశారు.

తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా నేడు జూన్‌ (22) ఉదయం 11.16 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అతిరథుల మధ్య వైభవంగా ముహూర్తం జరుపుకుంది.

Image

ఇంతకముందు ఎప్పుడు చూడని మాస్ రోల్​లో కనిపించబోతున్నట్లు తెలిపారు. “రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా…” అని చిత్రంలో ప్రతినాయ‌కుడు పాత్ర హెచ్చరిక గా అంటే.. “ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..!” అంటూ వైష్ణవ్​ గంభీరంగా చెప్పే డైలాగ్​ అదిరిపోయింది. 2023 సంక్రాంతికి రిలీజ్​ చేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుందని పేర్కొన్నారు.

Image

కాగా, ‘పీవీటీ04′(వర్కింగ్​ టైటిల్​) పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు శ్రీకాంత్​ ఎన్​ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్​.పీడీవీ ప్రసాద్​ సమర్పకులు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​, ఫార్టూన్​ ఫోర్​ సినిమాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ-సాయి సౌజన్య నిర్మాతలు. ఇక వైష్ణవ్​ నటించిన ‘రంగరంగ వైభవంగా’ గిరీశయ్య దర్శకుడు. కేతికశర్మ హీరయిన్​. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Related posts