మోదీ, అమిత్‌షాయే జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ ఇది మేకిన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ రాహుల్‌క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నేడు భారత్ బచావో ర్యాలీని చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్‌మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ స్వయంగా ధ్వంసం చేశారన్నారు. దేశం కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదని.. రాహుల్ గాంధీ అని అన్నారు. తాను క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. నిజం మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలా అని రాహుల్ ప్రశ్నించారు.
చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపారు: తలసాని