telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరివేపాకుతో ఆరోగ్యం.. ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మీకు కరివేపాకు ఇష్టం ఉండదా? అయితే, తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలిసిందే. మీ ఆరోగ్యానికి కరివేపాకు చేసే ఈ మేలు గురించి మిస్ కాకండి. కరివేపాకే అని కూరల్లో నుంచి తీసి పక్కన పెట్టేయకండి. వీలైతే ఆకును కూడా ఆహారంలో కలుపుకుని నమిలేయండి. ‘‘అబ్బే, బాగోదు..’’ అనుకుంటున్నారా? అయితే, తప్పకుండా ఈ విషయాలు మీరు తెలుసుకోవల్సిందే. ఇందంతా చదివిన తర్వాత కూడా మీరు ఇదే మాట మీద ఉంటారో లేదో చూద్దాం. తప్పకుండా మీరు నిర్ణయం మార్చుకోవడమే కాదు.. పచ్చి ఆకును కూడా నమిలేస్తారు. మరి, కరివేపాకు వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ప్రయోజనాలేమిటో చూసేద్దామా!
కరివేపాకుతో ఆరోగ్యం ఎంతవుందో చూడండి
✺ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
✺ కరివేపాకులో ఇంకా విటమిన్ C, A, B, Eలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
✺ కరివేపాకు అజీర్ణాన్ని అరికట్టి ఆకలిని పెంచుతుంది. కాబట్టి.. సమయానికి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. ✺ కరివేపాకు జీర్ణాశయ సమస్యలను నియంత్రింస్తుంది.
✺ విరేచనాలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా కరివేపాకును తీసుకోండి.
✺ శరీరంలోని అనారోగ్యకరమైన కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి గుండెకు మేలు జరుగుతుంది. బరువు కూడా తగ్గొచ్చు.
✺ కరివేపాకులోని లాక్సేటివ్ లక్షణా మలబద్దకాన్ని నివారిస్తాయి.
✺ మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను కరివేపాకు నియంత్రిస్తుంది.
✺ పేగులు, పొట్ట కండాలను బలోపేతం చేయడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది.
✺ క్యాన్సర్ ప్రేరేపితం కారకాలను కరివేపాకు నియంత్రిస్తుంది. కాబట్టి.. కరివేపాకు నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే క్యాన్సర్ భయం ఉండదు.
✺ కరివేపాకులో ఉండే కార్బోజోల్ ఆల్కలాయిడ్ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది.
✺ శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్‌లకు గురి కాకుండా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
✺ డయేరియాను కరివేపాకు నయం చేస్తుంది.
✺ ఫుడ్ పాయిజనింగ్‌ సమస్యను కరివేపాకు తగ్గిస్తుంది.
✺ చెమట, శరీర దుర్వాసనను కూడా కరివేపాకు నివారిస్తుంది.
✺ న్యుమోనియా, ఫ్లూ వంటి అనారోగ్య పరిస్థితుల్లో కరివేపాకు చక్కగా పనిచేస్తుంది.
✺ నిత్యం కరివేపాకు పొడితో ఆహారం తినేవారిలో రక్తంలో ఐరన్ శాతం పెరుగుతుంది. శరీరానికి మంచి రంగును కాంతి లభిస్తుంది.
✺ కరివేపాకు అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ఏ నేలపై అయినా పండుతుంది. కాబట్టి.. మీ ఇంట్లో తప్పకుండా కరివేపాకు మొక్కను పెంచుకోండి

Related posts