telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో ఆడిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు షాక్…

కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 2021 లో ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్లకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉన్న ప్లేయర్లకు రెడ్ బాల్ ప్రాక్టీస్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాంతో జోస్ బట్లర్‌, బెయిర్‌స్టో, సామ్‌ కరన్, క్రిస్‌ వోక్స్‌, మొయిన్ ‌అలీ న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. పెడ్యూల్ ప్రకారం జూన 2న తొలిటెస్టు లార్డ్స్‌లో జరుగుతుంది. దీంతో కేవలం రెండు వారాల సమయం ముందే వీరి క్వారంటైన గడువు ముగియనుంది. అయితే ఇంత తక్కువ సమయంలో వీరు టెస్టు సిరీస్‌కు సిద్ధం కాలేరని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఒల్లీ రాబిన్సన్, ఓవర్టన్, బ్రాసేలను ఆడించే చాన్సుంది. ‘ఈ వీకెండ్‌తో ఐసోలేషన్ పీరియడ్ ముగిస్తుంది. లార్డ్స్‌లో ఫస్ట్ టెస్ట్‌కు ఇంకా రెండు వారాల టైమ్ ఉంది. కానీ ఆలోగా క్రికెటర్లు ప్రాక్టీస్‌లోకి దిగడం కష్టమే. ప్రాక్టీస్ లేకపోవడంతో ఫిట్‌నెస్ సమస్యలు వస్తాయి. కౌంటీ చాంపియన్‌షిప్‌లో కొద్ది రోజులు గడిపితే మళ్లీ గాడిలో పడతారు. అప్పటివరకు రాచిన్సన్, ఓవర్టన్, జేమ్స్ బ్రాసీని టీమ్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నాం’అని ఈసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

Related posts