telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అరుదైన ఘనత సాధించిన రియల్‌ హీరో సోనూసూద్‌

Sonu-Sood

సోనూ సూద్ కరోనా కాలంలో ఎందరో వలస కూలీలకు తనవంతు సహాయం చేశాడు. వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మరీ వారికి ఇళ్ళకు చేర్చాడు. అంతేకాకుండా ఇతర దేశాలలో ఉన్నా వారికోసం ప్రత్యే ఫ్లైట్లను కూడా పెట్టించాడు. దాంతో దేశంలో రియల్ హీరోగా పేరు పొందాడు. అంతేకాకుండా కరోనా కారణంగా నిరుద్యోగులైన వారికి ఎందరికో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాడు. అయితే ఇటీవల సోనూ సూద్ తన పేరు మీద మరో రికార్డును రాశాడు. ఓ ప్రముఖ యూకే సంస్థ చేసిన సర్వేలో ఈ రియల్ హీరో పేరు కూడా ఉంది. ఆసియాలోని ప్రముఖ తారల సరసన సోనే నిలుచున్నాడు. ఈ సర్వేలో సంస్థ వారు ఈ ఏడాది మంచి పనులు చేసిన వారు, పాజిటివ్ పేరు తెచ్చుకున్న వారు ఇలా మంచి పనుల కోసం వారి హద్దులకు మించి ప్రయత్నించిన వారి పేర్లను నమోదు చేసింది. అలా చేసిన జాబితాలో టాప్ 50 మందిలో సోనూ సూద్ పేరు కూడా ఉంది. అయితే కరోనా సమయంలో తాను చేసిన దానిపై సోనూ మాట్లాడుతూ.. ‘మహమ్మారి విజృంభనతో నేను ఒకటి అర్థం చేసుకున్నాను. నా దేశ ప్రజలకు సహాయం చేయడం నా కర్తవ్యంగా భావించాను. వారి గురించి ఆలోచించడం నా తుది శ్వాస వరకు ఆపన’ని సోనూ అన్నాడు. ఈ ఏడాది దేశంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సోనూ సంపాదించుకున్నాడు. ది రియల్ హీరో అంటూ ప్రజలు అతడిని మెచ్చుకున్నారు. అంతేకాకుండా పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర యూత్ ఐకానిక్‌గా సోనూ సూద్‌ను నియమించింది.

Related posts