telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఐకాన్”గా చరణ్ ?

RC

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్” మూవీ తెరకెక్కాల్సి వుంది. అయితే “నా పేరు సూర్య”తో తీవ్రంగా నిరాశ పడ్డ బన్నీ సుకుమార్, వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టారు. సేఫ్ సైడ్ గా త్రివిక్రమ్ తో “అల వైకుంఠపురంలో” అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో “పుష్ప” చేస్తున్న బన్నీ తన 21వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ప్రకటించారు. దీనితో “ఐకాన్” మూవీ ఇక ఆగిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు మాత్రం స్క్రిప్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అందుకే రామ్ చరణ్ తో “ఐకాన్” మూవీ చేయాలని అనుకుంటున్నారట. “ఆర్ఆర్ఆర్” తరువాత చరణ్ తో ఈ మూవీ చేయాలనేది దిల్ రాజు ఆలోచనగా తెలుస్తుంది. ఇక చరణ్ నో చెప్తే నానితో చేయాలనేది దిల్ రాజు ప్లాన్ అని టాలీవుడ్ టాక్.

Related posts