telugu navyamedia
సినిమా వార్తలు

మంచు విష్ణు ప్యానల్ చేస్తున్న అసత్య ప్రచారం

మంచు విష్ణు ప్యానల్ చేస్తున్న అసత్య ప్రచారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పటి వరకు తమకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండ దండలు , ఆశీర్వాదాలు ఉన్నాయని విష్షు ప్యానల్ చేస్తున్న ప్రచారమంతా అబద్దమని మంత్రి పేర్ని నాని ప్రకటనతో తేలిపోయింది.


“మా ” ఎన్నికలకు జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఉందని, విష్ణు ప్యానల్ ను గెలిపించుకొని వస్తే, సినిమా రంగానికి కావలసినవన్నీ చేస్తామని జగన్ మోహన్ రెడ్డి కొంత మంది ప్రముఖులకు చెప్పినట్టు ఇంతకాలం ప్రచారం చేస్తున్నారు. మంచు విష్ణు జగన్ మోహన్ రెడ్డి కి బంధుత్వం వుంది. అందుచేత విష్ణుకు జగన్ మోహన్ రెడ్డి మద్దతు ఉందేమో అని తెలుగు సినిమా రంగంలో చాలామంది నమ్మారు.

సోమవారం ప్రకాష్ రాజ్ దీనిపై స్పందించారు. మంచు విష్ణుకు వైసీపీ లేదా టీఆర్‌ఎస్‌ మద్దతు వున్నా సరే తమ ప్యానలే ఘన విజయం సాదిస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే మేలుకొని సమాచార శాఖా మంత్రి పేర్ని నానితో ప్రకటన చేయించినట్టు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటనతో విష్ణు ప్యానల్ ఇబ్బందిలో పడిపోయినట్టు తెలుస్తుంది.

 

Related posts